మన తణుకు, మన ఆరిమిల్లి
మన తణుకు, మన ఆరిమిల్లి
స్వంత లాభం కొంత మానుకుని, పొరుగు వాడికి తోడుపడవోయి!” అని గురజాడ గారి అక్షర మాలను ఆశయాలు గా స్వీకరించి తనదైన శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తణుకు మాజీ మండలాధ్యకులు శ్రీ ఆరిమిల్లి వెంకటరత్నం గారి స్ఫూర్తి తో వారి మనువడు ఆరిమిల్లి రాధాకృష్ణ సింగపూర్ ఒడిలో తెలుగు వారికి తమ అమూల్యమైన సేవలందించి సింగపూర్ తెలుగు సమాజం కీర్తిప్రతిష్టలను మరింత పెంచి, అన్ని వర్గాల చేత ‘శభాష్ రాధాకృష్ణ’ అనిపించుకుని అందరివాడుగా మెప్పు పొందారు.
ప్రజా మానిఫెస్టో
దాదాపు దశాబ్దన్నర కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాను. 1400 కోట్లకు పైగా నిధులు తెచ్చి తణుకు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేశాను. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో మార్పునకు పెద్దపీట వేసాను. 2019 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడినా ప్రతిపక్ష నేతగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉంటూ వైసీపీ అరాచక పాలనపై పోరాడుతూనే ఉన్నాను. ప్రజా గొంతుకనయి సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నాను. తణుకు నియోజకవర్గ ప్రజల మేలు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేస్తోన్న నేను ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. నేను చేసిన ఉద్యమాల్లో, నా రాజకీయ పోరాటంలో నాకు మద్దతుగా ఉంటూ వచ్చిన మీరు ఈ ఎన్నికల్లో కూడా నాకు మద్దతివ్వండి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. రాబోయే రోజుల్లో అసలైన అభివృద్ది సిసలైన సంక్షేమాన్ని మన తణుకు ప్రజలకు అందించాలన్న ఏకైక ధృడ సంకల్పంతో నా ప్రజా మానిఫెస్టో మీ ముందు ఉంచుతున్నాను.
5 కోట్ల ఆంధ్రుల “భవిష్యత్తుకు గ్యారెంటీ" ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు
మహాశక్తి
ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం... సమాజంలో చదువుని ప్రోత్సహించేందుకు మన నాయకుడు చంద్రబాబు గారు ఇస్తున్న షూరిటీ... మన భవిష్యత్తుకు గ్యారెంటీ..!!
యువ గళం
రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం గ్యారెంటీ.. అప్పటిదాకా నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి..! యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు విజనరీ నాయకుడు చంద్రబాబు గారు ఇస్తున్న షూరిటీ.. మన భవిష్యత్తుకు గ్యారెంటీ..!
అన్నదాత
వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు ప్రతీ రైతుకు 20వేల చొప్పున ఆర్థిక సహాయం... అన్నదాతను ఆదుకునేందుకు మన అందరి నాయకుడు చంద్రబాబు గారు ఇస్తున్న షూరిటీ .. మన భవిష్యత్తుకు గ్యారెంటీ ..!
బి.సి లకు రక్షణ చట్టం
బి.సి. తారాగణం రక్షణ మీ ఆస్తుల భద్రత మరియు దీర్ఘాయువును నిర్ధారిస్తూ ఆరు పథకాలలో సమగ్ర రక్షణను అందిస్తుంది. ప్రతి పథకానికి తగిన పరిష్కారాలతో, మా రక్షణ సేవలు ప్రమాదాన్ని తగ్గించడం, ఆస్తి సంరక్షణ.
ఇంటి ఇంటికి మంచినీరు
ఇంటింటికి మంచినీటి పథకం" కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగే నీటిని అందించడం ద్వారా ప్రజల ప్రాథమిక అవసరాన్ని తీర్చేందుకు హామీ ఇస్తోంది......
పూర్ తో రిచ్
పేదలను ధనవంతులు గా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇందుకోసం ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తూ ఫలితాలు సాధించి పేదల్ని ఉన్నత స్థితిలో నిలుపుతుంది.