యర్రాయి చెరువు నుంచి వీరభద్రపురం వరకు – సకల జనుల చైతన్య పాదయాత్ర
యర్రాయి చెరువు నుంచి వీరభద్రపురం వరకు
కిలోమీటర్లు – 15
1) సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్రను బుధవారం ఉదయం యర్రాయి చెరువు లో ప్రారంభించాను. ఊరంతా కాలినడకన పర్యటించి పరిస్థితుల్ని పరిశీలించాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని, మన నియోజకవర్గంలో సాగుతున్న అరాచకాల్ని ప్రజలకు వివరించాను. అన్ని వర్గాల ప్రజల్ని చైతన్య పరుస్తూ పాదయాత్ర ముందుకు సాగింది. స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు అందుకొన్నాను. స్థానికులు ఇళ్ల స్థలాల కోసం చేసిన అభ్యర్థన మీద సానుకూలంగా స్పందించాను.
2) తర్వాత పాదయాత్ర మహాలక్ష్మి చెరువు గ్రామంలో ప్రవేశించింది. అక్కడ మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చంద్రబాబు గారి సూపర్ సిక్స్ పథకాల గురించి, ముఖ్యంగా మహాలక్ష్మీ పథకం గురించి విడమరిచి చెప్పాను. మహిళల సాధికారత కోసం రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యల గురించి అవగాహన కల్పించాను. ఊర్లోని స్థితిగతుల్ని పరిశీలించాను. తాగునీటి సమస్య గురించి స్థానికులు చెప్పినప్పుుడు దీనిని త్వరలోనే పరిష్కరించాలని నిర్ణయించుకొన్నాను.
3) మహాలక్ష్మీ చెరువు నుంచి నా పాదయాత్ర కొమరవరం గ్రామం చేరుకొంది. అక్కడ ఊరంతా వీధుల్లోకి వచ్చి స్వాగతం పలికారు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్రలో పాల్గొంటూ ఉత్సాహ పరిచారు. పవన్ కళ్యాణ్ మాటే మా బాట అంటూ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొంటామంటూ జన సైనికులు ఫ్లెక్స్ లు ఏర్పాటు చేశారు. గ్రామంలో పాదయాత్ర ప్రారంభం నుంచి చివరి దాకా తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి మమేకం అవుతూ పదం కలిపారు. టీడీపీ జనసేన కార్యకర్తలు ఐకమత్యం తో ముందుకు సాగుతూ పాదయాత్రకు జోష్ తీసుకొని వచ్చారు.
4) సాయంత్రం పాదయాత్ర కొమరవరం నుంచి వీరభద్రపురం చేరుకొంది. అక్కడ గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు ఇస్తూ పాదయాత్ర ను ప్రోత్సహించారు. రాజేశ్వరి పుంత దగ్గర రోడ్ల సమస్యల గురించి స్థానికులు విన్నవించారు. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైందని తెలియచేశారు. కాలనీల్లో సీసీ రోడ్లన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో నిర్మించినవే అని చూపించారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ సమస్యల్నీ పట్టించుకోవటం లేదని తిట్టి పోశారు. ఈ ప్రభుత్వాన్ని దించేసే ఉద్యమంలో తామూ భాగస్వాములం అవుతామని తేల్చిచెప్పారు. అక్కా చెల్లెమ్మల చైతన్యం చూసి నాలో బాధ్యత మరింత పెరిగింది అనిపించింది. పల్లె నిద్ర లో భాగంగా వీరభద్రపురంలోనే బస చేశాను.
Author