మన ఆరిమిల్లి రాధాకృష్ణ
అంకితభావం, నూతన ఆలోచనలు, మరియు సేవ యొక్క ప్రయాణం
ఆరిమిల్లి రాధాకృష్ణ పరిచయం:
“స్వంత లాభం కొంత మానుకుని, పొరుగు వాడికి తోడుపడవోయి!” అని గురజాడ గారి అక్షర మాలను ఆశయాలు గా స్వీకరించి తనదైన శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తణుకు మాజీ మండలాధ్యకులు శ్రీ ఆరిమిల్లి వెంకటరత్నం గారి స్ఫూర్తి తో వారి మనువడు ఆరిమిల్లి రాధాకృష్ణ సింగపూర్ ఒడిలో తెలుగు వారికి తమ అమూల్యమైన సేవలందించి సింగపూర్ తెలుగు సమాజం కీర్తిప్రతిష్టలను మరింత పెంచి, అన్ని వర్గాల చేత ‘శభాష్ రాధాకృష్ణ’ అనిపించుకుని అందరివాడుగా మెప్పు పొందారు
1973, అక్టోబర్ 25న తణుకు మండలం వేల్పూరు గ్రామం లో శ్రీ ఆరిమిల్లి చక్రధర రావు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులకు ఐదవ సంతానం గా జన్మించారు. రాధాకృష్ణకి ఒక అక్క ముగ్గురు అన్నలు ఉన్నారు. ప్రాధమిక స్థాయి విద్యాభ్యాసమంతా వేల్పూరు గ్రామంలోనే సాగింది. ఉన్నత విధ్యబ్యాసమంతా ఏలూరు, విజయవాడలలో చేసి, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎమ్.యస్సీ (కంప్యూటర్ సైన్స్) పెట్టా పుచ్చుకున్నారు.
2000లో స్విట్జర్లాండ్, UBS బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్న కృష్ణ తులసి తో వివహమైంది. వీరి ఏకైక కుమారుడు నిఖిల్ రత్న, ప్రతి పురుషుడి ఆశయ సాకారం వెనుకా ఒక స్త్రీ ఉంటుందన్న నానుడిని నిజం చేస్తూ కృష్ణతులసి తన భర్త జీవితం శతసహస్ర కిరణాలతో భాసిల్లే విధంగా తన వంతు పాత్ర పోపించారు.
1998వ సంవత్సరం సింగపూర్ లో ఉన్నత ఉద్యోగానికి వెళ్ళిన రాధాకృష్ణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్థాయి నుండి కృషి, పట్టుదల తో మ్యానేజ్మెంట్ స్థాయికి ఎదిగారు. అలాగే చిన్న నాటి నుండి తను పెరిగిన రాజకీయ, సేవా కుటుంబ వాతావరణం నేపథ్యంలో తన కోసం తాను బతికే వాడు మనిషి… సమాజం కోసం జీవించే వాడు “మహర్షి”… అనే స్ఫూర్తితో ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో పాటు తెలుగు సమాజ సేవలో తన వంతు పాత్ర పోషించారు. నాది… నా కోసం… అనే స్వార్ధ గుణాలు మచ్చుకైనా కానరాని పరిణితి చెందిన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం రాధాకృష్ణ. అందుకే అందరికి అప్పుడుగా నిలిచాడు.
సింగపూర్ తెలుగు సమాజంలో ఉప కోశాధికారి (2004-2006) ఉపాధ్యకులు (2006-2008), అధ్యకులు (2008- 2011) గా తమ సేవలను అందించి సింగపూర్ తెలుగు వారందరి మన్ననలు పొందారు. తన పదవి కాలం లో తను ముందుండి అందరి సహకారం తో ఎన్నో కళా, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేపట్టి విజయభేరి మోగించాడు.
పది మందికి సేవ చెయ్యడం అనేది ఒకరు చెప్తే చేసి కార్యక్రమం కాదు. మనసు పొరల్లో, నరనరాలలోను సేవానిరతి ఉండాలి. అప్పుడే ఆ కార్యక్రమాలకు ఒక నిండుతనం వస్తుంది. ఒక వ్యక్తిగా చెయ్యలేనిది ఒక వ్యవస్థగా చెయ్యవచ్చు అని నమ్మి ఎంతో మంది ప్రవాసాంద్రులని ప్రోత్సహించి పలు సేవాకార్యక్రమాలు విజయవంతంగా చేపట్టిన సేవాతత్పరుడు రాధాకృష్ణ. నాది అనుకోకుండా ఎల్లప్పుడు మనది అనుకొనే గొప్ప వ్యక్తిగా సమాజం లో ఎన్నో కార్య క్రమాలు రూపొందించి దిగ్విజయంగా నిర్వహించడం రాధాకు అలవాటుగా మారింది.
రక్త దానం చేయటం వలన కేవలం ఒక మంచి పని చేయటమే కాకుండా ఒక ప్రాణం నిలిపిన వాళ్ళం కూడా అవుతామని ప్రగాఢంగా నమ్మి సింగపూర్ రెడక్రాస్ సంస్థ తో కలిసి పలు రక్తదాన శిబిరాలను ద్వారా, తెలుగు సమాజం సభ్యులను ప్రోత్సహించి వారిచే రక్తదానం చేయించి ఎంతో మంది రోగులకు ప్రాణదానం చెయించారు.
సింగపూర్ లో నివసిస్తున్న తెలుగువారికి స్వాతంత్రదినోత్సవము, గణతంత్రదినోత్సవం వంటి ముఖ్యదినాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి వారిని ఆనందించి చేసి, అన్నదాత సుఖీభవ అని వృద్ధుల అశీస్సులు అందుకున్నారు.
సింగపూర్ లో నివసిస్తున్న భారతీయుల అభివృద్ధి కోసమై సింగపూర్ ప్రభుత్వం చే స్థాపించబడినటువంటి సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) తో సింగపూర్ తెలుగు సమాజాన్ని భాగస్వామిగా చేసి సమాజానికి కార్యాలయ ఏర్పాటు దిశగా అవిరామంగా కృషి చేసి సింగపూర్ తెలుగు వారి కోరికను సాదించారు.
అంతే కాకుండా SINDA నిర్వహించిన పలు సామజిక కార్యక్రమాలు, ముఖ్యంగా పేద విద్యార్థుల కొరకై చేపట్టిన “Project. give” కార్యక్రమం ద్వారా ఆర్థిక విరాళాలు సేకరించి ఒక తెలుగు వారిలోనే కాక పలు భారతీయ సేవా సంస్థలలో మంచి గుర్తింపు సాదించారు.
కేవలం సింగపూర్ లోనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం లో ప్రతిభ ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సహాయం ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండి సింగపూర్ తెలుగు వారందరినీ బాగాస్వాములను చేసి పలువురు పేదలకు ఆర్ధిక సహాయం అందించిన మంచి మనిషి రాధాకృష్ణ 2009లో రాష్ట్రం లో సంబవించిన వరదలలో సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల సహాయార్ధం సింగపూర్ లో ఉన్న తెలుగువార అందరినీ సంఘటితపరచి దాదాపు నాలుగు లక్షల రూపాయల విరాళాలు సేకరించి, గద్వాల్, ఆలంపూర్ నియోజకవర్గాల్లో సర్వస్వం కోల్పోయి ఫీజులు చెల్లించలేని పరిస్థితులలో వున్న 43 మంది వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులకు అప్పటి రాష్ట్ర చిన్న తరహ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి డి.కె. అరుణ గారి చేతుల మీదుగా పంపిణీ చేయించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తన కర్త్యవంగా భావించిన వ్యక్తి రాధాకృష్ణ.
భాషోద్ధరణ
భారతదేశం లో హిందీ తరువాత అధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 16 కోట్ల మంది తెలు గు వారు ఉన్నాడు. అందులో తెలుగు వారిగా చెప్పుకుంటూ తెలుగు మాట్లాడలేని వారు కోట్ల సంఖ్య లో ఉన్నారంటే ఆశ్చర్యం క లగవచ్చు. అయిదారు తరాలుగా భాషకు దూరమైన వారు ప్రపంచం లో అనేక చోట్ల ఉన్నారు. ఇక తెలుగు చదువను, వ్రాయను వచ్చిన వారు మూడున్నర కొట్టంటి నమ్మలేము గాని ఇది వాస్తవం. ఒక భాష సజీవమై, కలకాలం, చిరకాలం సర్వేతముకాబి వృద్ధి చెందాలంటే మన మాతృ బాష మాట్లాడడం, చదవడం, వ్రాయడం అనేది మన దిన చర్యల్లో భాగమై ఉండాలి. ప్రగాఢంగా నమ్మి. తల్లి భాషను కాపాడుకోవడం ధర్మంగా భావించి సింగపూర్ లో ఉంటున్న తెలుగు పిల్లలు కోసం ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యకురాలు శ్రీమతి ఇందిరాదత్తు గారి సహకారం తో ఉచిత ‘తెలుగు బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాతృభాష తియ్యదనాన్ని రుచి చూపించి ఎంతో మంది ప్రశంసలు పొందారు.
సింగపూర్ లో ఉన్న ప్రత్యేక నిభంధనల వలన తెలుగు వారికి టీవీ చూసే అవకాశం లేనటువంటి సమయం లోతెలుగు టీవీ చానల్ కొరకై నిర్విరామ కృషి చేసి తెలుగు టీవీ ఛానల్ ప్రసార కార్యక్రమాలు ప్రారంభింపచేసి తెలుగు వారి చిరకాల వాంచను తీర్చిన రాధాకృష్ణ ఎంతైనా ప్రశంసీనీయుడు
అవగహనా సదస్సులు:
సింగపూర్లో ఉన్న తెలుగువారందరికీ భారత దేశములో జరుగుతున్నమార్పులను ఎప్పటికప్పుడు అందించాలనే సంకల్పంతో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులతో సదస్సులు ఏర్పాటు చేసే మాతృభూమిలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై అవగహన కల్పించి సింగపూర్లో ఎంతో అనుభవం సాదించిన తెలుగువారిని మాతృభూమికి తమ వంతు సేవ చెయ్యడానికి స్ఫూర్తిని కలిగించాడు.
ఆధ్యాత్మికం:
ఉరుకుల పరగుల జీవితం తో ప్రతి రోజు ఉద్యోగ భాద్యతలలో మునిగి తేలుతూ శ్రమ ఒత్తిడిలతో సతమతమవుతూ ఉన్న వారి కోసం ధ్యానం. యోగా తదితర కార్యక్రమాల ద్వారా ఎంతో మంది తెలుగు వారికి తమ సమస్యలను స్వీయా ధ్యాన శక్తి తో పరష్కరించుకోనే దిశగా పిరమిడ్ సొసైటీ పత్రీజీ గారి సందేశాలు, బ్రహ్మ్మ కుమారిస్ వ్యక్తిత్వ వికాస సదస్సులు మరియు విహంగం యోగ తరగతులు ఏర్పాటు చేసిన ఘనత రాధాకృష్ణ కే చెందుతుంది
విదేశాలలో ఉంటున్నా ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారు తమ తమ పండుగలను ఇతర మతాలతో కలసి చేసుకునే సంప్రదాయం సింగపూర్ తెలుగు వారి గొప్పదనం. ముఖ్యమైన తెలుగు పండుగలు, గీత ప్రవచనాలు, క్రైస్తవ ఆరాధన సభలు, ఇఫ్తార్ విందులు వంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి మత సామరస్యాన్ని చాటిచెప్పిన రాధాకృష్ణ సింగపూర్ తెలుగువారందరిలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు.
ప్రతి సంవత్సరం ఉగాది రోజున తిరుపతి నుండి పట్టు వస్త్రాలు, ప్రసాదములు మరియు పూజాద్ సామగ్రిన్ తిరుపతి నుండి తెప్పించి శ్రీ వెంకటేశ్వర కళ్యాణమహేూత్సవం, సింగపూర్ బైబిల్ మిషన్ తో సంయుక్తం క్రిస్టమస్ వేడుకలు, సింగపూర్ లో ఉంటున్న కార్మిక సోదరుల ప్రత్యేక వినాయక చవితి తదితర ఉత్సవాలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం విజయవంతంగ నిర్వహించడం రాధాకృష్ణ కార్యదక్షతకి నిదర్శనం.
క్రీడాస్పూర్తి:
మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి… అలసిన మనసులను ఏకం చెయ్యడానికి మనోల్లసానికి… క్రీడలు వారధిగా ఉంటాయని నమ్ముతూ సింగపూర్ తెలుగు వారందరని ఒక తాటిపై తీసుకువచ్చి ఆర్థిక భారాన్ని లెక్కచెయ్యకుండా వివిధ వ్యక్తులను, సంస్థలను భాగస్వాములను చేసి క్రికెట్, బౌలింగ్, బాడ్మింటన్ టోర్నమెంట్లు విజయవంతంగా నిర్వహించి సింగపూర్ తెలుగు వారిలో సమైక్యతను పెంపొందించి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన ఘనాపాటి మన రాధాకృష్ణ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కళారాధన
ఏ సమాజం లోనైనా కళలు కళకళలాడాలంటి ఆయా రంగాలలో ప్రతిభావంతులైన కళాకారులు ఎంత అవసరమో, ఆ కళను ప్రోత్సహించే కళా పోషకులు అంతే అవసరం. సంగీత, నృత్య సాహిత్య, నటన రంగాలలో ఎందరో ప్రతిభావంతులైన నూతన కళాకారులకు, పెద్దల ప్రోత్సాహంతో సింగపూర్ తెలుగు సమాజం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు కల్పించిన రాధాకృష్ణ కళామ తల్లి నుదుట సింధూరం ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రముఖ సినీ, నృత్య సాహిత్య, సంగీత, హాస్య, జానపద కళాకారులను సింగపూర్ తీసుకు వచ్చి పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కళాసేవకుడు రాధాకృష్ణ.
సత్కారాలు:
సింగపూర్ వచ్చిన అతిధులకు రాధాకృష్ణ ఏర్పాటు చేసి ఆత్మీయ ఆతిద్యం, సత్కారాలు పొందినవారు తీపి జ్ఞాపకాలతో వెలతారనడంలో ఎటువంటి సందేహం లేదు. సింగపూర్ వచ్చే వివిధ రంగాలలో నిష్ణాతులైన పలువుడు ప్రముఖులు రాధాకృష్ణ ఆతిధ్యం పొంది తమ ఆశీస్సులు అందించి ఆనందంగా వెళ్ళేవారు.
36 సంవత్సరాల వయసులో సింగపూర్ తెలుగు సమాజం చరిత్రలో అతి చిన్న వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణ. సమాజ ఆర్థిక పరిపుష్టతను పెంచి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సింగపూర్ తెలుగు వారి మనసులలో చెరగని ముద్ర వేసారనడంలో ఎటువంటి సందేహం లేదు. చెరగని చిరునవ్వుతో, ఓర్పుతో, ఎంత క్లిష్టమైన సమస్యనైనా అలవోకుగా పరిష్కరించగల నేర్పరితనం రాధాకృష్ణ సొంతం
రాజకీయరంగ ప్రవేశం:-
జీవితంలో డబ్బు సంపాదనే కాకుండా, సమాజానికి ఏదైనా చెయ్యాలనే తపన ఉన్న రాధాకృష్ణ శ్రీ బోళ్ళ బుల్లి రామయ్య గారి ఆశీస్సులతో, శ్రీ వై.టి. రాజా గారి ప్రోత్సాహంతో తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయరంగంలో 2014 లో రాజకీయరంగ ప్రవేశం చేసారు.
సరిగా అదేసమయంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన లో తణుకు నియోజకవర్గంలో సమైక్యంద్ర కొరకు తణుకు నియోజకవర్గమంతా ప్రజలలో చైతన్యం కొరకు ఉద్యమం నిర్వహించి సమైక్యంద్ర పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి గుమ్మాన్ని సందర్శించి ఆంధ్రులు అందరూ కలిసే ఉండాలి అనే నినాదంతో ప్రజలలో ఉద్యమ కాంక్ష తీసుకువచ్చారు.
- తరువాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్తూ తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసారు.
- 2013 నవంబర్ నుండి ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్ర ద్వారా నియోజకవర్గంలో మరోసారి పాదయాత్ర నిర్వహించి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి మనిషిని పలుకరించి నియోజకవర్గంలో 14 రోజులలో 378 కి.మీ పాదయాత్ర చేసారు. ఆ సమయంలో ప్రతి ఊరిలో పర్యటిస్తూ ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలను తెలుసుకొని డైరీ లో నోట్ చేసుకొన్నారు.
- 2014 సం.లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆరిమిల్లి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడుగారి ఆస్సీసులతో తణుకు నియోజవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున MLA అభ్యర్ధిగా పోటీచేసి YCP అభ్యర్ధిపై సుమారు 30 వేల భారీ మెజార్టీ తో గెలిచారు.
- గెలిచిన తర్వాతి రోజు నుండే నిరంతరం ప్రజలలో ఉంటూ గ్రామదర్శిని అనే ఒక సొంత ఆలోచనతో ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు అధికారులతో కలిసి రోజు ఉదయం 6 గంటలకే నియోజకవర్గంలోని పల్లెలను సందర్శించి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే వారు. ఎన్నికలకు ముందు ప్రజల సమస్యలు తెలుసుకొని డైరీలో నోట్ చేసుకొన్న రాధాకృష్ణ గారు ప్రణాళికా బద్దంగా వాటిని అన్నింటిని పరిష్కరించారు.
- 2014 కు ముందు నియోజవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు. 2014 లో ఆరిమిల్లి రాధాకృష్ణ గారు MLA గా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోను SC, BC ఏరియాలలో మొత్తం రోడ్లను CC రోడ్ల గా మార్చారు. NTR సుజల స్రవంతి ద్వారా RO వాటర్ అందించారు.
- డ్రైనేజీ సమస్యలను పరిష్కరించే విధంగా పక్కా ప్రణాళికతో CC డ్రైన్ లను, అండర్ గ్రౌండ్ డ్రైనీజీలను ఏర్పాటు చేయించారు. నియోజవర్గంలో రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టి ఏళ్ల తరబడి ఇరుకుగా ఉన్న తణుకు పట్టణంలోని నరేంద్ర సెంటర్ , రాష్ట్రపతి రోడ్ లను విస్తరణ చేయించారు. ట్రాఫిక్ సమస్యలను చెక్ పెట్టారు.
- అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నుండి అనేక నిధులను తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్దికి విశేష కృషి చేసారు. నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి, నియోజక వర్గం లో అనేక చోట్ల విధ్యుత్ సబ్ స్టేషన్ లను నిర్మించి ప్రజలకు నాణ్యమైన విధ్యుత్ ను అందించారు.
- భారతీయ విద్యార్ధి పార్లమెంట్, పూణే వారి ద్వారా 2015 లో ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి ఆదర్శ యువ శాసనసభ్యులు అవార్డు రావడం జరిగింది.
- 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ పనితీరు కనబరిచిన MLA గా 90 శాతం మార్కులతో నాలుగు సార్లు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. రాధాకృష్ణ ను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఇతర MLA లకు చెప్పారు.
- నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం రాధాకృష్ణ ఎప్పుడు చూసినా అర్జీలు, ఫైల్స్ పట్టుకొని ముఖ్యమంత్రి కార్యాలయాల చుట్టూ తిరుగుతారు అని తోటి సహచర MLA లు నిత్యం అనేవారు.
- అయితే 2019 సం.లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం తరపున పోటీ చేసిన రాధాకృష్ణ గారు అతి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందారు. అయినా కూడా నియోజకవర్గ ప్రజల బాగు కోసం, అభివృద్ధి కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు.
- 2020-21 సం.లో కోవిడ్ సమయంలో తణుకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదలకు నిత్యం కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసర సరుకులు అందించారు. కోవిడ్ నుండి రక్షణ కొరకు మాస్క్, సానిటైజేర్లు పంపిణీ చేసారు. కోవిడ్ బారిన పడిన అనేక మందికి ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారు. కోవిడ్ సమయంలో తణుకు నియోజకవర్గంలో ప్రాణాంతక పరిస్థితులలో హాస్పిటల్లో బెడ్స్ దొరక్క ఇబ్బంది పడిన తన ద్రుష్టి కి వచ్చిన వారి అందరికి హాస్పిటల్ లో బెడ్స్ అందేలా ఏర్పాట్లు చేయించారు.
- తానా వారితో కలిసి రైతుల కోసం రైతు రక్షణ కిట్స్, బాటరీ స్ప్రేయర్లు, వంటి రైతులకు ఉపయోగపడే వస్తువులను నియోజకవర్గంలో అనేక గ్రామాల రైతులకు ఉచితంగా అందించారు.
- గ్రేస్ ఫౌండేషన్, తానా వారితో కలిసి బసవ తారకం కాన్సర్ ఆసుపత్రి నుండి డాక్టర్ల ను తీసుకువచ్చి తణుకు నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఉచితంగా కాన్సర్ పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు కాన్సర్ వ్యాధి పట్ల అవగాహనను కలిగించారు.
- 2019 నుండి తెలుగుదేశం పార్టీ ఆదేశించిన ప్రతి ఆదేశాన్ని, బాడుడే-బాదుడు, ఇదేం ఖర్మ వంటి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలో ముందుండి నడిపించారు.
- తణుకు నియోజకవర్గంలో YCP ప్రభుత్వ నాయకులు 2023 సం.లో చేసిన TDR బాండ్ల కుంభకోణం ను బయటపెట్టి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించి ప్రజల సొమ్ము అవినీతి పరుల పాలు కాకుండా అడ్డుకొన్నారు.
- 2023 సం.లో చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కు నిరసనగా తణుకు నియోజకవర్గంలో నిరాహారదీక్షలు, రాస్తారాకోలు, బైక్ రాలీ లు నిర్వహించారు. చంద్రబాబు గారు బయటకు వచ్చేవరకు నియోజవర్గంలో ప్రతి రోజు రిలే నిరాహారదీక్ష లు నిర్వహించారు.
- 2024 ఫిబ్రవరి నుండి తెలుగుదేశం పార్టీ ఆదేశించిన బాబు ష్యురిటీ- భవిష్యతు గారెంటీ, మహా శక్తీ, సూపర్ SIX , పూర్ to రిచ్ వంటి పధకాలను ప్రజల లోకి తీసుకువేల్లెందుకు సకల జనుల చైతన్య యాత్ర – రేపటి కోసం పాదయత్ర కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు.
- YCP ప్రభుత్వం కక్షసాధింపు చర్యగా మూసేసిన అన్నా క్యాంటీన్ లను తణుకు నియోజకవర్గంలో ఆరిమిల్లి రాధాకృష్ణ గారి చొరవతో అత్తిలి టౌన్, తణుకు టౌన్ లలో నిర్వహిస్తూ పేదల, అన్నార్తుల కు నిత్యం అన్నదానం చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు.
- ఇలా ఆరిమిల్లి రాధాకృష్ణ గారు అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు అతను ప్రజల పక్షంమే అంటూ తన నియోజకవర్గ శ్రేయస్సుకై అనుక్షణం ఆలోచిస్తూ ప్రణాళికలు రచిస్తూ ఉంటారు.
2004 - 2006
సహాయ కోశాధికారి
సింగపూర్ తెలుగు సమాజం (STS)
2006 - 2008
ఉపాధ్యక్షుడు
సింగపూర్ తెలుగు సమాజం (STS)
2008 - 2011
అధ్యక్షుడు
సింగపూర్ తెలుగు సమాజం (STS)
2013
భారతదేశంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు.
2014 - 2019
తణుకు నియోజకవర్గం నుండి ఎమ్.ఎల్.ఏ
అభివృద్ధి మరియు సమాజ క్షేమం వైపు
2019 - 2024
తెలుగు దేశం పార్టీ తణుకు ఇంచార్జి
2024
సాధారణ ఎన్నికలు
తెలుగు దేశం పార్టీ తణుకు ఎమ్.ఎల్.ఏ అభ్యర్థి