జగన్ ద్రోహనికి మండే గుండెల నిరసన స్వరం – తణుకు వేదికగా జరిగిన ఉమ్మడి ప్రజాగళం అధినేతలు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జన నీరజనాలు వైసీపీ చీకటి పాలనకు ఇక చెల్లుచీటి., రైతున్నను ఏడిపించిన వైసీపీ పార్టీ తుడుచుపెట్టుకుపోవడం ఖాయం పులకరించిన తణుకు – ఎటు చూసిన జన ప్రవాహమే…తణుకు నియోజకవర్గం లో జరిగిన ఉమ్మడి ప్రజాగళం సభ ఈ ఎన్నికలలో తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి విజయానికి నాంది.
తణుకు పట్టణం లోని తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం .. నియోజకవర్గం వ్యాప్తంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల ఆత్మీయ కలయిక. అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి గారు , మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారు.. విచ్చేసిన తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు..!
తణుకు మండలం దువ్వ గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా వైభవంగా జరిగిన రథోత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకొని …. తణుకు నియోజకవర్గం ప్రజలందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం వెల్లి విరియాలని కోరుకొంటూ ప్రత్యేక పూజలు
హైదరాబాదులో “టౌన్ హాల్ మీటింగ్ ప్రొఫెషనల్స్ కనెక్ట్ విత్ లీడర్స్” కార్యక్రమం లో వివిధ రంగాల నిపుణులతో తణుకు నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ స్థితిగతులపై మరియు అధికార పార్టీ వాళ్లు చేసిన స్కామ్లపై విశ్లేషణ కార్యక్రమం లో పాల్గొనడమైనది.
తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.జనం కోసం పనిచేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు. బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాలుపంచుకున్న జనసైనికులు, ఆరిమిల్లి యూత్ సోదరులు
వైభవంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుతణుకు మండలం వేల్పూరు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొనడమైనది.ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాబోవు రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి లో తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది.
యర్రాయి చెరువు నుంచి వీరభద్రపురం వరకుకిలోమీటర్లు – 15 1) సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్రను బుధవారం ఉదయం యర్రాయి చెరువు లో ప్రారంభించాను. ఊరంతా కాలినడకన పర్యటించి పరిస్థితుల్ని పరిశీలించాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని, మన నియోజకవర్గంలో సాగుతున్న అరాచకాల్ని ప్రజలకు వివరించాను. అన్ని వర్గాల ప్రజల్ని చైతన్య పరుస్తూ పాదయాత్ర ముందుకు సాగింది. స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు అందుకొన్నాను. […]