మన తణుకు నియోజకవర్గం
తణుకు.. ఈ పేరు వింటేనే మనకొక పులకరింత. ఈ పట్టణం తో మనకు అవినాభావ సంబంధం. అది విడదీయలేని బంధం. మరపురాని మధుర జ్ఞాపకం. ఇక్కడి గాలి, నేల,నీరు అన్నీ.. మనకు సుపరిచితాలే. అన్నిటితో మనకి ఆత్మీయ సంబంధాలే. అంతలా పెన వేసుకుని పోయింది తణుకుతో మన బంధం.
మనం ఇంతగా అభిమానించే తణుకులో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో కనిపిస్తూ, అన్ని చోట్ల వినిపించే వ్యక్తి మన ఆత్మీయ నేస్తం ఆరిమిల్లి రాధాకృష్ణ.
తణుకు మనకు ఆశ్రయమిస్తే రాధాకృష్ణ మనకు ఆసరా ఇచ్చారు.
తణుకు మనకు బతకటానికి భూమి ఇస్తే రాధాకృష్ణ బతికే మార్గం చూపించారు.
తణుకు మనకు సాగుకు నీరు ఇచ్చింది. ఆ నీరు సక్రమంగా సాగేలా చేశారు రాధాకృష్ణ.
తణుకు మనకు తాగటానికి నీరు ఇచ్చింది. రాధాకృష్ణ ఆ నీటిని మన ఇంట్లోకి తెచ్చారు.
నడవటానికి దారి చూపింది. ఆ దారిని రాధాకృష్ణ రహదారి చేశారు.
ఆరోగ్యంగా జీవించే అవకాశం ఇచ్చింది తణుకు. అనారోగ్యం కలిగినా భయం లేదంటూ భరోసా ఇచ్చారు రాధాకృష్ణ.
రైతుగా జీవించమని కోరింది తణుకు. రాధాకృష్ణ ఉండగా మాకేంటి దిగులు అని ఆనందంతో చెప్పాడు అన్నదాత.
తణుకు నారు పోస్తే రాధాకృష్ణ నీరు పోశారు.
తణుకు ధాన్యం పండిస్తే రాధాకృష్ణ గిట్టుబాటు ధర ఇచ్చారు.
తణుకు విద్యార్థులను అందిస్తే రాధాకృష్ణ నాణ్యమైన విద్య అందించారు.
తణుకు.. మహిళకు జన్మనిస్తే స్వయం ఉపాధి ద్వారా రాధాకృష్ణ వారికి పునర్జన్మ ఇచ్చారు.
తణుకుతో మన బంధం విడదీయలేనిది. రాధాకృష్ణతో మన బంధం విస్మరించరానిది.
మనం అభిమానించే తణుకు ను మరింత సుందరం గా తీర్చిదిద్దేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారు. తనకున్న సమయం, తన తెలివితేటలు, తన ఆర్థిక వనరులు అన్నీ మన కోసం, మన తణుకు బాగు కోసం వాడారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయమంతా ఆయనే స్వయంగా ఫైల్స్ పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. నా తణుకు కు అది కావాలి, నా తణుకులో ఇది చేయాలి, నా వాళ్లకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అందించాలి అంటూ పదేపదే ఓ సామాన్యుడిలా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. మనకు కష్టాలు లేకుండా చూడాలని తపన పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించినప్పుడు మన రాధాకృష్ణ నెంబర్ వన్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారంటే ఆయన దీక్ష, దక్షిత, పనితీరు, తనను ఎన్నుకున్న ప్రజల పట్ల బాధ్యత, చిత్తశుద్ధి, సమస్యలు పరిష్కరించి ప్రజల కళ్ళలో ఆనందం చూడాలన్న తపన కనిపిస్తుంది. తానే కాదు తన తణుకు కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉండాలని, మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దాలన్న ఆలోచన అగుపిస్తుంది.
అవినీతి, అక్రమాలు ఆశ్రిత పక్షపాతం నిండిపోయిన నేటి రాజకీయ వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు నాయకుడనేవాడు సినిమాలో విలన్ లా మనకు కనిపిస్తాడు. స్వాతంత్ర ఉద్యమం నాటి నాయకుల్లో ఉండే త్యాగం, క్రమశిక్షణ, బాధ్యత, నిస్వార్థం లాంటి లక్షణాలు ఏవీ నేటి నాయకులలో మచ్చుకైనా కానరావని బాధపడతాం.
కానీ మన రాధాకృష్ణ లాంటి వ్యక్తిని చూసినప్పుడు రాజకీయ వ్యవస్థ ఇంకా పూర్తిగా కలుషితం కాలేదు, గంజాయి వనంలో తులసి మొక్కలా మన రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. స్వాతంత్ర్య కాలం నాటి నాయకుల లక్షణాలను పుణికి పుచ్చుకున్న మన రాధాకృష్ణ నేటి తరానికి నికార్సైన నాయకుడు రేపటితరానికి ఆదర్శప్రాయుడు. ఆయన అందరికీ అభిమాన పాత్రుడు, అత్యున్నత నాయకుడు, అందరివాడు, నాయకులందరిలోకి మెరుగైనవాడు.
రాధాకృష్ణ పై వ్యక్తం చేసే ఏ అభిప్రాయం కూడా అతిశయోక్తి కాదు అక్షర సత్యం . అవి పొగడ్తలు కావు, పచ్చి నిజాలు. అందరూ ఒప్పుకొని తీరే పరమ సత్యాలు. ఆయన గురించి గొప్పగా చెప్పటం కాదు, ఆయన చేసిన గొప్ప పనులే ఆయనను తణుకు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకునేలా చేశాయి.
తణుకు పేరు వినగానే గుర్తొచ్చే పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణ పేరు వింటే గుర్తొచ్చే పేరు తణుకు. ఆరిమిల్లి ఆయనకు ఇంటిపేరు కావచ్చు. కానీ తణుకు నియోజకవర్గ ప్రజల హృదయాలలో ఆయన “తణుకు రాధా కృష్ణ” .
తణుకుతో ఆయనది ఫెవికాల్ బంధం. తణుకే ఆయన శ్వాస. తణుకే ఆయన జీవనం. తణుకే ఆయనకు సర్వస్వం. తణుకు బాగు కోసమే ఆయన తపన.
పుట్టి పెరిగిన ప్రాంతం స్వర్గంతో సమానం అంటారు. ఉన్నత విద్యావంతుడై విదేశాల్లో సుఖమయ జీవనం సాగిస్తున్నప్పటికీ జన్మభూమి మీద మమకారంతో తనకు స్వర్గం లాంటి తణుకుకు వచ్చి, తన వనరులన్నీ ఇచ్చి, మనకోసం శ్రమటో ర్చి, మన బాధలు తీర్చి, మన సుఖమయ జీవనానికి బాటలు వేసిన రాధాకృష్ణ మనకు లభించిన ఒక ఆణిముత్యం.
తన ప్రజల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగేలా చేసే వ్యక్తిని తణుకే ఆవిర్భవింప చేసింది. తనకు అప్పచెప్పిన బాధ్యతలను ఆయన తచ తప్పకుండా అమలు చేశారు. అందుకే ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యారు. మిగిలిపోయిన కార్యాలను కూడా ఆయనతోనే పూర్తి చేయించాలని అభిలషి స్తోంది తణుకు. అందుకే ఆయనకు మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చింది.
ఆశీర్వదించటం మన పని. అభివృద్ధి చేయటం ఆయన పని.
అండగా ఉండటం మన బాధ్యత. ఆసరా చూపటం ఆయన కర్తవ్యం.
మనం చేయూత నివ్వాలి. ఆయన చేదోడు గా ఉంటారు.
మనం బలపరచాలి. ఆయన మనల్ని బాగుపరుస్తాడు.
ఆయనకు మనం అవకాశం ఇవ్వాలి. విశ్వాసంతో ఆయన పని చేస్తారు.
అంతా ఒక్క తాటిపైకి వచ్చి ఓటేసి ఆయనను గెలిపిస్తే ఆయన తణుకును గెలిపిస్తారు.
కాబట్టి నిర్ణయం మనదే. ఖచ్చితంగా ,నిశ్చితం గా గెలిపించా ల్సింది మనమే.